గోపీచంద్ కు జోడీగా మెహరీన్
BY Telugu Gateway6 May 2019 3:14 AM GMT

X
Telugu Gateway6 May 2019 3:14 AM GMT
ఎఫ్ 2 సినిమాలో ‘హనీ’ పాత్రతో అందరిని ఆకట్టుకుంది మెహరీన్. గతంలో తెలుగులో మెహరీన్ పలు సినిమాలు చేసినా ఎఫ్2 మాత్రం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇఫ్పుడు గోపీచంద్ తో జోడీ కట్టనుంది. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ గూఢచారి (స్పై) పాత్రలో నటిస్తున్నారు.
ఇంత కాలం యాక్షన్ సన్నివేశాలతో బిజీగా ఉన్న ఈ హీరో..ఇఫ్పుడు హీరోయిన్ మెహరీన్ తో కలసి ఆడి పాడనున్నారు. తాజాగా గోపీచంద్ పాకిస్థాన్ సరిహద్దులో 45 రోజులు యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Next Story