Telugu Gateway
Cinema

వంద కోట్ల క్లబ్ లో ‘మహర్షి’

వంద కోట్ల క్లబ్ లో ‘మహర్షి’
X

మహేష్ బాబు హీరోగా నటించిన ప్రతిష్టాత్మక 25వ సినిమా ‘మహర్షి’ వంద కోట్ల క్లబ్ లో చేరిందా?. అంటే ఔననే చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు రాబట్టిందని సమాచారం. మహర్షి సక్సెస్ మీట్ లో మహేష్ బాబు కూడా మహర్షి రాబోయే రోజుల్లో రికార్డులు నెలకొల్పనుందని ప్రకటించారు. నైజాంలో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బీట్ చేసిందని సమాచారం. మహర్షి సినిమా విషయంలో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఆశాజనంగానే ఉన్నట్లు కన్పిస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నను ముగ్గురు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యంగా వ్యవసాయాన్ని అందరూ విస్మరించటం అనే అంశంపై ఫోకస్ చేశారు. అదే సమయంలో ‘వీకెండ్ అగ్రికల్చర్’ అనే కొత్త కాన్సెప్ట్ ను కూడా సినిమాలో చూపించారు.

Next Story
Share it