Telugu Gateway
Politics

లగడపాటి అంచనా..టీడీపీదే అధికారం

లగడపాటి అంచనా..టీడీపీదే అధికారం
X

ఏపీలో మళ్ళీ టీడీపీనే అధికారం నిలబెట్టుకుంటుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి వంద సీట్ల వరకూ వస్తాయన్నారు. ఓ పది సీట్లు అటూ ఇటూ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. లగడపాటి ఆదివారం నాడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. వైసీపీకి 72 సీట్లకు మరో ఏడు ఆటో ఇటో వస్తాయని పేర్కొన్నారు. అధికార టీడీపీ-ప్రధాన ప్రతిపక్ష వైసీపీల మధ్య ఓట్ల తేడా కేవలం రెండు శాతం మాత్రమే ఉందని వెల్లడించారు.

టీడీపీకి 43 శాతం ఓట్లు వస్తే..వైసీపీకి 41 శాతం, జనసేనకు 11 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు. ఏపీతో పాటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను లగడపాటి ప్రకటించారు. ఎన్నికల ముందు, తర్వాత నెల నెలా ఓటరు నాడి పట్టే ప్రయత్నం చేశామని.. తమ టీమ్ శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించిందన్నారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని లగడపాటి తేల్చిచెప్పారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కారు జోరు ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ కు 14 ఎంపీ సీట్లు రావొచ్చన్నారు. కాంగ్రెస్ కు 0-2 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఆర్జీ ప్లాష్ టీమ్ సర్వే ప్రకారం.. అసెంబ్లీ స్థానాలు

టీడీపీ 100 (+/-) 10

వైసీపీ 72 (+/-) 7

ఇతరులు 03 (+/-) 2

పార్లమెంట్‌ స్థానాలు

టీడీపీ 15 (+/-) 2

వైసీపీ 10 (+/-) 2

ఇతరులు 1

అసెంబ్లీ స్థానాల్లో పార్టీల ఓట్ల శాతం

టీడీపీ 43 - 45 %

వైసీపీ 40 - 42 %

జనసేన 10-12 %

పార్లమెంటు స్థానాల్లో ఓట్ల శాతం

టీడీపీ 43 - 45 %

వైసీపీ 40.5 - 42.5 %

జనసేన 10 - 12 %

Next Story
Share it