కర్ణాటక సీఎంకు కెసీఆర్ ఫోన్
BY Telugu Gateway3 May 2019 7:21 AM GMT

X
Telugu Gateway3 May 2019 7:21 AM GMT
జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ దృష్టి సారించారు. ఆయన శుక్రవారం నాడు ఈ అంశంపై కర్ణాటక సీఎం కుమార్వస్వామితో ఫోన్లో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్ కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం ...ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జూరాలపై ఆధారపడ్డ పాలమూరు గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం ముఖ్యమంత్రి కెసీఆర్ చర్చలు జరిపారు.
Next Story