డియర్ కామ్రెడ్ కొత్త పాట వచ్చేసింది

విజయ్ దేవరకొండ ఈ మధ్య ఓ ప్రకటన చేశారు. త్వరలోనే ‘సాంగ్ ఆఫ్ ద ఇయర్’ పాటను విడుదల చేస్తామన్నారు. ఆయన చెప్పిన సాంగ్ ఆఫ్ ద ఇయర్ సాంగ్ వచ్చేసింది. కదలల్లే వేచే కనులే’ అంటూ సాగిన పాట ఆకట్టుకునేలా ఉంది. విజయ్..రష్మికల మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ ను ఎట్రాక్ట్ చేసేవిగా ఉన్నాయి. మరి విజయ్ చెప్పినట్లు ఈ సాంగ్ అంత పేరు తెచ్చుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే.
డియర్ కామ్రెడ్ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలోని రెండో పాటను బుధవారం విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడిగా రూపొందించిన ‘కదలల్లే’ పాటను సిద్ధ్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్‌లు పాడారు. విజువల్‌గానూ పాటను పోయటిక్‌గా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఓకేసారి రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.
https://www.youtube.com/watch?time_continue=106&v=pEGOFNxmqZo