ఎన్టీఆర్ ఫోటో వైరల్
BY Telugu Gateway5 May 2019 7:43 AM GMT

X
Telugu Gateway5 May 2019 7:43 AM GMT
ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో కీలక పాత్ర పోషిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతికి బ్యాండ్ తో ..భార్య ప్రణతితో కలసి ఉన్న ఫోటోను ఆయన అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీని వెనక ఓ బలమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే మే5న వీళ్లిద్దరి పెళ్లి రోజు. పెళ్ళి అయి ఎనిమిదేళ్ళు అయిన సందర్భంగా భార్యతో కలసి ఓ ఫోటో దిగారు.
అదే ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ చేతికి గాయం కావటంతో వల్లే ఆయన బ్యాండేజ్ వేసుకున్నారు. ఓ వైపు రామ్ చరణ్ తోపాటు ఎన్టీఆర్ కు గాయాలు కావటంతో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ పడినట్లు అయింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story