Telugu Gateway
Cinema

పాటలు మినహా ‘ఇస్మార్ట్ ’రెడీ

పాటలు మినహా ‘ఇస్మార్ట్ ’రెడీ
X

ఇస్మార్ట్ శంకర్. టైటిల్ తోనే దర్శకుడు పూరీ జగన్నాధ్ వెరైటీ చూపించారు. రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నాలుగు పాటల చిత్రీకరణ పూర్తయితే సినిమా రెడీ. కొన్ని పాటలను విదేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో రామ్ కు జోడీగా నిధి అగర్వాల్ , నభా నటేష్ లు హీరోయిన్లు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హీరో రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పుట్టిన రోజైన మే 15న ఇస్మార్ట్ శంకర్‌ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు.

Next Story
Share it