జూలై 12న ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్

హీరో రామ్ చేస్తున్న ఊరమాస్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. వాస్తవానికి ఈ సినిమా సమ్మర్ లో నే సందడి చేయాల్సి ఉంది. కానీ సినిమా హీరోయిన్లలో ఒకరి పాస్ పోర్టు పోవటం..షూటింగ్ లో జాప్యం కావటం వల్ల సినిమా ఆలశ్యం అయింది. ఇప్పుడు హీరో రామ్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జూలై 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రామ్ టెరిఫిక్‌గా ఉన్నాడని అభినందిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తయింది. 3 పాటలు మినహా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది.