రామ్ కొత్త సినిమా రీమేక్ తోనా?
BY Telugu Gateway19 May 2019 3:07 PM IST
X
Telugu Gateway19 May 2019 3:07 PM IST
హీరో రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమా ఫినిషింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇఫ్పటికే టాకీ పూర్తిచేసుకున్న ఈ సినిమా పాటలు పూర్తి చేసుకుంటే పూర్తయిపోయినట్లే. దీంతో రామ్ కొత్త సినిమాకు రెడీ అయిపోతున్నారు. అయితే ఈ సారి ఓ రీమేక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘థడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ రైట్స్ ఇప్పటికే స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను గతంలో రామ్ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
Next Story