గన్నవరం నుంచి ముంబయ్ కు స్పైస్ జెట్
BY Telugu Gateway26 May 2019 7:23 AM GMT

X
Telugu Gateway26 May 2019 7:23 AM GMT
స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసు ప్రారంభించింది. గన్నవరం నుంచి ముంబయ్ కు విమాన సర్వీసులు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. నూతన సర్వీసును విమానాశ్రయ అధికారులు ప్రారంభించారు. విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయం ట్రాఫిక్ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ఇఫ్పటికే ఇండిగో సంస్థ విజయవాడ నుంచి సింగపూర్ కు సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో పలు దేశీయ రూట్లతోపాటు..అంతర్జాతీయ రూట్లలోనే సర్వీసులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Next Story