Telugu Gateway
Politics

హాట్ హాట్ గా ‘గన్నవరం రాజకీయం’

హాట్ హాట్ గా ‘గన్నవరం రాజకీయం’
X

మండే ఎండలకు తోడు కృష్ణా జిల్లాలోని ‘గన్నవరం రాజకీయం’ కూడా అంతే హాట్ హాట్ గా సాగుతోంది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని ‘టెన్షన్’ అక్కడ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ, వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ అభ్యర్ధి వెంకట్రావు అయితే ఏకంగా ఎమ్మెల్యే వంశీపై కమిషనర్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేశారు. అయితే యార్లగడ్డ వెంకట్రావుతో మాట్లాడాలనే తాను ఆయన ఇంటికి వెళ్లానంటూ వంశీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ లేఖలో వంశీ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. మన ఉమ్మడి స్నేహితుడు కొడాలి నాని ద్వారా తాను చేసిన సాయం గురించి ప్రస్తావించారు. రమేష్ అనే వ్యక్తి ఎస్సీ, ఎట్రీ అట్రాసిటీ కేసు పెట్టిన సమయంతోపాటు..భవానీపురం పోలీస్ స్టేషన్ లో వరకట్న వేధింపుల కింద కేసు నమోదు అయినప్పుడు సాయం చేసినా..ఇద్దరం ఎప్పుడూ కలుసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే తాను నానీ వల్లే ఇదంతా చేసినట్లు చెప్పారు. దీనికి నువ్వు నానికి రుణపడి ఉండాలని పేర్కొన్నారు. ఎప్పుడూ కూడా తాను వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు.

నియోజకవర్గంలో మంచి వాతావరణం కోసమే తాను వ్యక్తిగతం కలవటానికి ప్రయత్నించాను తప్ప..మరో ఉద్దేశం లేదని పేర్కొన్నారు. గన్నవరాన్ని డల్లాస్ గా మారుస్తానన్న మీ ప్రతిపాదన విని మీకు సన్మానం చేయాలనుకున్నానని..అందుకే ఫోన్ చేశాను అని తెలిపారు. నా గురించి నువ్వేమి భయపడనక్కర్లేదు. నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉ:డదు అని తలిపారు. దేవుడున్నాడు..ఆయనకు అన్నీ తెలుసు అని వ్యాఖ్యానించారు. అందరికీ దేవుడు న్యాయమే చేస్తాడని పేర్కొన్నారు. వెంకట్రావు కూడా సోమవారం మీడియాతో మాట్లాడి వంశీపై విమర్శలు చేశారు. తాను ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని,కాని వంశీనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన అన్నారు.గతంలో పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతలు,కాకాని వెంకటరత్నం వంటి మహానుబావులు ప్రాతినిద్యం వహించిన గన్నవరం నియోజకవర్గంలో ప్రజలకు తాను సొంత డబ్బుతో సేవ చేయడానికి వచ్చాను తప్ప, మట్టి అమ్ముకోవడానికి , చెరువులు అమ్ముకోవడానికి రాలేదని ఆయన అన్నారు.

మాజీ ఎమ్మెల్యే బాలవర్దనరావు, ఆయన సోదరుడు జై రమేష్ లు కష్టపడి పైకి వస్తే వారిని ఉద్దేశించి వంశీ అనుచితంగా మాట్లాడారని ఆయన అన్నారు. గతంలో జగన్ ను బెంగుళూరు వెళ్లి మరీ వంశీ కలిశాడో లేదో చెప్పాలని ఆయన అన్నారు.ఎమ్మెల్యే ప్రజలపై కూడా చేయి చేసుకున్న ఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు. తగాదాకు తాను వెళ్లబోనని,అయితే తమ కిందకు నీళ్లు వస్తే సహించబోనని ఆయన అన్నారు. వంశీ ఇష్టం వచ్చినట్లు భాష వాడుతూ రాజకీయాలను దిగజార్చారని ఆయన అన్నారు. జగన్ అదికారంలోకి వస్తున్నారన్న భయంతో వంశీ ఏమేమో చే్స్తున్నారని ఆయన అన్నారు. గతంలో వంశీ పోటీచేసినవారికి కూడా సన్మానం చేస్తానని చెప్పారా అని ఆయన ప్రశ్నించారు.

Next Story
Share it