Telugu Gateway
Politics

అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ

అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
X

అంతర్జాతీయ వాణిజ్యపోరు తీవ్రరూపం దాల్చే సూచనలు కన్పిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చైనా టార్గెట్ గా పలు నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత దూకుడు పెంచారు. ఆయన ఏకంగా నేషనల్ ఎమర్జన్సీ ప్రకటించారు. అమెరికాలోని కంప్యూటర్ నెట్ వర్క్ కు విదేశీ శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలోని కంపెనీలు విదేశీ టెలికమ్ సేవలను ఉపయోగించే ఛాన్స్ లేకుండా పోయింది. ముఖ్యంగా చైనాకు చెందిన ప్రముఖ టెలికం సంస్థ హువావేని టార్గెట్ చేసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే తాజా ఆదేశాల్లో అయితే ఏ దేశం, కంపెనీ పేరును ప్రస్తావించకుండానే ఆదేశాలు జారీ చేశారు. గత కొంత కాలంగా అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు హువాయి చైనా కోసం గూడఛర్యం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయాన్ని ఫెడరల్ కమ్యనికేషన్ ఛైర్మన్ అజిత్ మంచి నిర్ణయంగా అభివర్ణించారు.

హువావే కు చెందిన 5 జీ నెట్ వర్క్ వాడకంపై కూడా అమెరికా మిత్రదేశాలకు సూచిస్తోంది. అమెరికా ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎలాంటి సాంకేతిక పరిరకాలను కొనుగోలు చేయరాదని పేర్కొన్నారు. తాజా పరిణామంతో చైనా-అమెరికాల మధ్య మరింత దూరం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామంపై హువావే స్పందించింది. తమతో వ్యాపారం చేయనంత మాత్రాన అమెరికా భద్రంగా ఉన్నట్లు ఏమీ కాదని పేర్కొంది. అమెరికా విధించిన ఆంక్షలను అర్థం లేనివిగా కొట్టిపారేసింది. తాము ఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటం లేదని స్పష్టం చేసింది.

Next Story
Share it