పాస్ పోర్టు వెనక్కి ఇఛ్చిన చంద్రబాబు
BY Telugu Gateway30 May 2019 4:22 AM GMT

X
Telugu Gateway30 May 2019 4:22 AM GMT
తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్లొమాటిక్ పాస్ పోర్టును సరెండర్ చేశారు. ముఖ్యమంత్రులకు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఇస్తారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు దారుణ ఓటమి పాలై...వైఎస్ జగన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కేంద్ర విదేశాంగ జారీ చేసిన తన డిప్లొమేటిక్ పాస్ పోర్టును అప్పగించి..రెగ్యులర్ పాస్ పోర్టును తీసుకున్నారు. బుధవారం నాడు విజయవాడలోని పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు ఈ పని పూర్తి చేశారు. ఆ సమయంలోనే పాస్ పోర్టు కార్యాలయంలోని కొంత మంది వ్యక్తులు చంద్రబాబుతో ఫోటో దిగేందుకు ఆసక్తిచూపారు.
Next Story