Telugu Gateway
Politics

సైకిల్ కు ఓటేయవద్దంటే కొడుకునూ కొట్టారు

సైకిల్ కు ఓటేయవద్దంటే కొడుకునూ కొట్టారు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీ సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. సైకిల్ కు ఓటేయవద్దని అన్న కొడుకును కొట్టిమరీ ఓటేసిన చెల్లెళ్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది అందరిలో పెంపొందాలి. ఆత్మవిశ్వాసమే కాదు, ఆంధ్రులమనేది గర్వకారణం కావాలన్నారు. టీడీపీకి ఓటు వేయటానికి తెలంగాణ నుంచి వెళ్తారని సీఎం కెసీఆర్ స్మెల్ చేశారని వ్యాఖ్యానించారు.అందుకే కూకట్ పల్లి బస్ స్టేషన్ మూసేశారని అన్నాారు హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు రద్దు చేశారని ఆరోపించారు. ఆటోలో హైదరాబాద్ నుంచి అనంతపురానికి వచ్చి మరీ ఓటేశారని చంద్రబాబు అన్నారు. కెసీఆర్ పై కసితో టీడీపీకి ఓటేయటానికి హైదరాబాద్ నుంచి భారీగా తరలివచ్చారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ శాశ్వతం,రాష్ట్రం శాశ్వతం. ఇక ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వాటన్నింటికి పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో ఎటు తిరిగి గెలుస్తాం, అది ముఖ్యం కాదు..రాబోయే ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలి. ఏ డబ్బు, ఏ అధికారం, ఏ కుట్ర, ఏ కుతంత్రం టిడిపి గెలుపును అడ్డుకోలేని స్థాయికి పార్టీ చేరాలి. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయం. అందులో సందేహం లేదు.ఎన్ని సీట్లు వస్తాయి, ఏ సీటులో ఎంత ఆధిక్యత వస్తుందనేదే ఇప్పుడు ముఖ్యం అని పార్టీ నేతలతో అన్నారు. కుప్పం ఎన్నికను ఒక నమూనాగా తీసుకోవాలి. లోయస్ట్ ఎక్సె పెండిచర్, హయ్యస్ట్ మెజారిటి. ప్రజల్లో చెడ్డపేరు రాకుండా కార్యకర్తల సాధికారత నా లక్ష్యం. ఆర్ధికంగా,రాజకీయంగా,సామాజికంగా కార్యకర్తలను పైకి తేవాలి.ఏడాదికి రూ.100కోట్లతో కార్యకర్తల సంక్షేమానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఫలితాలపై మన అసెస్ మెంట్ సిన్సియర్ గా చేయాలి, నాయకుల పనితీరుపై గ్రేడింగ్ చేయాలి. 23న ఫలితాలతో మన అంచనాలను బేరీజు వేసుకోవాలి. ఫలితాల్లో మీ అంచనాలు నిజమైతే మీ పనితీరులో విజయం సాధించినట్లే. ఎక్కడ మనం విజయం సాధించాం,ఎక్కడ మనం విఫలం అయ్యాం అనేది విశ్లేషించుకోవాలి. ప్రతి గ్రామంలో పార్టీ బలపడాలి, ప్రతి కార్యకర్త ఆర్ధికంగా బలోపేతం కావాలి.సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలం. రాష్ట్రంలో ప్రతి బూత్ తెలుగుదేశం పార్టీకి ఏకపక్షం కావాలి. ప్రతి బూత్ లో టిడిపి ఆధిక్యత శాశ్వతంగా నిలబడాలి. అందుకోసం ఎవరి స్థాయిలో ఏమేం చేయాలో అన్నీచేయాలి.గ్రామాల్లో సర్పంచి,బూత్ కన్వీనర్లు,సేవామిత్రలు,కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి. పార్టీలో ప్రతిఒక్కరూ పనిచేయాలి. మీ గ్రామంలో,మీ బూత్ లో మీ పట్టు ఎప్పుడూ నిలబెట్టుకోవడమే నాయకత్వ సామర్ధ్యం.

సొంత బూత్ పై పట్టులేని వాడు రాష్ట్ర స్థాయి నాయకుడెలా అవుతాడు.? సొంత బూత్ లో ఓట్లు రావు, తాను మాత్రం రాష్ట్ర స్థాయి నాయకుడు అంటాడు. ఇలాంటి రాష్ట్ర నాయకులను పెట్టుకుని నేనేం చేయాలి..? అందుకే బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా నిర్మిస్తున్నాం. ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ప్రక్షాళన చేస్తున్నాను. బూత్ కమిటి,ఏరియా కమిటి అన్నిస్థాయిల్లో పార్టీ సంస్థాగత బలం నా కల. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ యంత్రాంగం పటిష్టతే నా లక్ష్యం.

ప్రతి కార్యకర్త పొలిటికల్ ఇంటలిజెన్స్ పెంచుకోవాలి. 2009, 2014ఎన్నికల్లో ఏయే బూత్ లలో ఎన్ని ఓట్లు వచ్చాయి.? 2019ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి..? సిన్సియర్ గా అసెస్ మెంట్ చేయాలి. రేపటి ఫలితాలతో మీ అంచనాలను బేరీజు వేసుకోవాలి అని సూచించారు.

Next Story
Share it