Telugu Gateway
Cinema

వర్మ తిరుపతి వెళ్లినప్పుడే అనుకున్నా!

వర్మ తిరుపతి వెళ్లినప్పుడే అనుకున్నా!
X

‘నాన్న గారు నేను ఓ బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను. సంధ్యా వందనంలో సంధ్య ఉంది. చదివే వేదాల్లో వేద ఉంది. వేసే పద్మాసనాల్లో పద్మ ఉంది. మీ లైఫ్ లో ఏమి ఉంది. నీ కొడుకు రెండు బ్రెయిన్స్ తో పుట్టాడు. రెండు బ్రెయిన్సా?. రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను. నాకు మీలో చాగంటి కన్పిస్తున్నారు. నాకు అయితే పకోడిగాడు కన్పిస్తున్నారు. ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ గా రాముడిని చూపించవచ్చు. ఎలా ఉండకూడదో చూపించాలంటే అభిని చూపించవచ్చు. అసలు ఇంతకీ ఈ అభి ఎవరు అంటారా?. బుర్రకథ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆది.

పైన చెప్పినవి అన్నీ ‘బుర్రకథ’ సినిమా టీజర్ లోని డైలాగ్ లే. టీజర్ చూస్తుంటే సాయి కుమార్ తనయుడైన ఆదికి హిట్ దక్కినట్లే కన్పిస్తోంది. టీజర్ ఆది నటన..కామెడీ డైలాగ్ లు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసిన టీజర్ వినూత్నంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ కీలకపాత్రలో నటించగా.. మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందించగా.. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=aCjiKkt8zMs

Next Story
Share it