Telugu Gateway
Cinema

అనుష్క రీ ఎంట్రీ

అనుష్క రీ ఎంట్రీ
X

స్వీటి అనుష్క టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం బ్రేక్ తీసుకున్న ఈ భామ కామ్ గా తన ‘నిశ్సబ్దం’ అనే సినిమా షూటింగ్ కు రెడీ అయిపోయింది. భాగమతి సినిమా హిట్ తర్వాత అనుష్క కన్పించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనుష్క ‘ ‘సైలెంట్‌’ అనే బహుభాషా చిత్రం అంగీకరించారు. మాధవన్, అనుష్క జంటగా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రానుంది. అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్‌ స్టార్‌ మైఖేల్‌ మ్యాడిసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అమెరికాలోని సీటెల్‌ ప్రాంతంలో ప్రారంభమైంది. చాలా శాతం షూటింగ్‌ అక్కడే జరుపుకోనుంది. సైలెంట్‌ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్‌ యాక్టర్స్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్‌ షానీ డియోల్‌ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it