సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది

ప్రభాస్ అభిమానులకు ఇక పండగే. ఎందుకంటే ఆయన నటించిన ప్రతిష్టాత్మక సినిమా సాహో ఫస్ట్ లుక్ విడుదల అయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఇస్తున్నాం అంటూ ప్రభాస్ సోమవారం ఓ వీడియో మేసేజ్ రిలీజ్ చేశాడు. అభిమానులు ప్రభాస్ ఇచ్చే సర్‌ప్రైజ్ ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూశారు. మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ సర్‌ప్రైజ్‌ను రివీల్ చేశాడు.
సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్ లుక్‌లో ఉన్న ప్రభాస్ పోస్టర్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.