Top
Telugu Gateway

డిఫరెంట్ లుక్ లో ‘వాల్మీకి’గా వరుణ్

డిఫరెంట్ లుక్ లో ‘వాల్మీకి’గా వరుణ్
X

వాల్మీకీగా వరుణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ కు తగ్గట్లుగానే గుబురు గడ్డం..చెలరేగిన చుట్టుతో కూడిన ఓ ఫోటోను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ కూడా గురువారం నాడే ప్రారంభం అయింది. మండుటెండల్లో చిత్ర యూనిట్ చెమటోడ్చుతోందని దర్శకుడు ట్వీట్ చేశారు. తమిళ హిట్‌ మూవీ జిగర్తాండను తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్‌ చేస్తున్నారు. తొలి రోజు షూటింగ్ లో భాగంగా వరుణ్‌తేజ్‌పై కొన్ని సన్నివేశాలను షూట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ హాట్‌ సమ్మర్‌లో టెర్రఫిక్‌ వర్క్‌ చేస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

Next Story
Share it