Telugu Gateway
Cinema

వరలక్ష్మీ ‘చేజింగ్’

వరలక్ష్మీ ‘చేజింగ్’
X

వర్మలక్ష్మి శరత్ కుమార్. డైనమిక్ నటి. ఏ పాత్రను అయినా సరే అలవోకగా నటించగల శక్తి ఆమె సొంతం. కేవలం హీరోయిన్ క్యారెక్టర్లే కాదు...నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలైనా సరే..నేను రెడీ అంటూ దుమ్మురేపుతోంది. ఇప్పుడు వరలక్ష్మి కొత్తగా ‘చేజింగ్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో శరవేగంగా సాగుతోంది. వెండితెరపై బైక్‌ రేసర్‌గా వరలక్ష్మి ఎంత దుమ్మురేపారో వేచిచూడాల్సిందే. ఈ సినిమాలో యమున, బాల, జెర్రోల్డ్, రఘు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చేజింగ్ సినిమాకు దాసి సంగీత దర్శకుడు. కె. వీరకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Next Story
Share it