Telugu Gateway
Politics

రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసులు

రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసులు
X

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒకింత ఇబ్బందికర పరిస్థితి. కాపలాదారే దొంగ అంటూ గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీపై రాహుల్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాఫెల్ డీల్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా మోడీని దొంగ అన్నట్లు రాహుల్ వ్యాఖ్యలు చేశారని రాహుల్ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయనని..చౌకీదార్‌ చోర్‌ (కాపలాదారే దొంగ) అనే వ్యాఖ్యలను తమకు ఆపాదించినందుకు గాను ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. ఎన్నికల సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి..చౌకీదార్‌ చోర్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అనిల్ అంబానికి రూ.40 వేల కోట్లు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో లబ్ధి జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల సభలో రాహుల్‌ పేర్కొన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్‌ ఆరోపణలు చేశారు.

Next Story
Share it