Telugu Gateway
Politics

చంద్రబాబుఫై సుమలత ‘పంచ్’

చంద్రబాబుఫై సుమలత ‘పంచ్’
X

చంద్రబాబు ప్రచారంపై సుమలత ‘పంచ్ పడింది.’ ఆయన ప్రచార ప్రభావం ఏమీ ఉండదని లైట్ తీస్కోండి అంటూ తేలిగ్గా తీసిపారేసింది. ఎందుకంటే అసలు మాండ్యాలో తెలుగువారే ఉండరని..ఇక్కడ ఆయన చెపితే ఓటు ఎవరు వేస్తారనే రీతిలో సుమలత స్పందించటం విశేషం. ఏపీకి చెందిన సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయటంపై కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన వ్యతిరేంగా వార్తలు వచ్చాయి.

ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి కోసం పాటుపడతామని చెప్పి..ఏపీకి చెందిన సుమలత బరిలో నిలవగా కర్ణాటకకు చెందిన సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన తరపున చంద్రబాబు సోమవారం నాడు ప్రచారం నిర్వహించారు. సుమలత మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేస్తున్నారు. ఆమెకు బిజెపి మద్దతు పలుకుతోంది.

Next Story
Share it