Top
Telugu Gateway

వడ్డీ రేట్లు తగ్గాయోచ్

వడ్డీ రేట్లు తగ్గాయోచ్
X

మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) వడ్డీ రేట్లు తగ్గించింది. ఎన్నికల ముందు ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ బిఐ తాజా సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించటంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్దీ రేట్లు తగ్గనున్నాయి. ఇది ఆయా కస్టమర్లకు ఊరట ఇచ్చే నిర్ణయం. ఇటీవల కాలంలో ఆర్ బిఐ వడ్డీ రేట్లను తగ్గించటం ఇది రెం‍డవసారి. తాజా మార్పుల్లో రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి ఆరు శాతానికి పరిమితం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలిసారి మూడు రోజుల భేటీ అనంతరం ఆర్‌బీఐ కీలక రేట్ల నిర్ధారణ కమిటీ గురువారం వడ్డీ రేట్ల తగ్గింపును వెల్లడించింది.

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటును ఉత్తేజింపచేసేందుకు ఆర్‌బీఐ రెపోరేటును పావు శాతం మేర తగ్గిస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆశించాయి. ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపోరేటుగా పేర్కొనే విషయం తెలిసిందే. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులకు కేంద్ర బ్యాంక్‌ నుంచి తీసుకునే నిధులపై వ్యయం తగ్గడంతో అవి రుణ కస్టమర్లకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే రుణాలు పొంది నెలవారీ వాయిదాలు చెల్లించే కస్టమర్లకూ ఈఎంఐల భారం కొంతమేర తగ్గనుంది.

Next Story
Share it