రజనీ ‘దర్భార్’కు షాక్
BY Telugu Gateway27 April 2019 4:02 PM IST
X
Telugu Gateway27 April 2019 4:02 PM IST
లీకు వీరుల ముందు ఎంత పెద్ద హీరో అయినా తలవంచాల్సిందే. దక్షిణాది సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఆయన తాజా చిత్రం ‘దర్భార్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయటంతో చిత్ర యూనిట్ కు షాక్ కు గురైంది. డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలసిందే. రజనీ సరసన కథానాయికగా నయనతార నటిస్తోంది. తాజాగా రజనీతో పాటు నయనతార ఉన్న ఫొటో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో చిత్రయూనిట్ లీకులను ఆపేందుకు చర్యలు తీసుకుంటోంది. సెట్‌లోకి విజిటర్స్ రాకుండా నిషేదం విదించటంతో పాటు సెల్‌ఫొన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకం పై ఆంక్షలు విదిస్తున్నారు.
Next Story