Telugu Gateway
Politics

పులివెందుల రౌడీలకు అధికారమిస్తారా?

పులివెందుల రౌడీలకు అధికారమిస్తారా?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల రౌడీలను ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం ప్రమాదంలో పడుతుందని అన్నారు. జగన్ కు విశ్వసనీయత లేదని విమర్శించారు. తనను నమ్ముకుంటే భవిష్యత్ బాగుంటుందని..అదే జగన్ అధికారంలోకి వస్తే అంతా జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రతి రోజూ సాయంత్రం అయితే జగన్ లోటస్ పాండ్ కు వెళుతున్నారని..అక్కడ తెలంగాణ సీఎం కెసీఆర్ కు రిపోర్టు చేస్తున్నారని విమర్శించారు.

వైఎస్ పాలనలో ఐఏఏస్ లు కూడా వీళ్ల అవినీతి వల్ల జైలుకు వెళ్లారన్నారు. జగన్ కు అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ ఉండదని హెచ్చరించారు. ప్రధాని మోడీవి అన్ని తుగ్లక్ చర్యలే అని విమర్శించారు. తాను తిరిగి అధికారంలోకి వచ్చాక అమరావతిలో 20 హైదరాబాద్ లు నిర్మిస్తానని తెలిపారు. నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it