Telugu Gateway
Cinema

ప్రత్యేక గీతంలో పాయల్ రాజ్ పుత్

ప్రత్యేక గీతంలో పాయల్ రాజ్ పుత్
X

ఒక్క సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించారు పాయల్ రాజ్ పుత్. ఆమె హీరోయిన్ గా నటించి ఆర్ ఎక్స్ 100 సినిమా బాక్సాపీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఆమెకు తెలుగులో వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ భామ ప్రత్యేక గీతాలకూ సై అంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సీత సినిమాలో పాయల్ ఓ ప్రత్యేక పాటలో కన్పించనుంది.

బుల్ రెడ్డి అంటూ సాగే పాటలో ఆమె సందడి చేయనుంది. ఈ పాటను చిత్ర యూనిట్ ఏప్రిల్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది తన మొదటి ప్రత్యేక గీతం అని చెబుతూ..పాటకు సంబంధించిన స్టిల్స్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది ఈ అమ్మడు. సీత సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Next Story
Share it