హాట్ హాట్ ‘నిధి అగర్వాల్’
నిధి అగర్వాల్. ఇప్పటి వరకూ చేసిన క్యారెక్టర్లు అన్నీ సంప్రదాయబద్దంగా ఉన్నాయి. ఇప్పుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఈ భామ నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ స్టైల్ లో నిధి అగర్వాల్ ను హాట్ హాట్ గా మార్చాడు. రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ తోపాటు నభా నటేష్ నటిస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో ‘దిమాక్ ఖరాబ్...’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్స్ తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాట తెలంగాణ యాసలో సాగుతుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఆన్‌లోకేషన్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిధి అగర్వాల్ లుక్‌కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.