Telugu Gateway
Telangana

మారుతి కార్ల రేట్లు తగ్గాయ్

మారుతి కార్ల రేట్లు తగ్గాయ్
X

ఆటోమొబైల్ రంగంలోని అగ్రశ్రేణి కంపెనీ మారుతి తన ఉత్పత్తులపై రేట్లను గణనీయంగా తగ్గించింది. మారుతీ సుజుకీ ప్రధాన డీలర్‌ షిప్‌ నెక్సా ద్వారా విక్రయిస్తున్న కార్లపై సూపర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై సుమారు రూ.60 వేల వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ​ ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. సియాజ్‌, బాలెనో, ఎస్‌-క్రాస్‌, ఇగ్నిస్‌ కార్లపై ఈ డిస్కౌంట్‌ రేట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ పై రూ.33 వేల దాకా తగ్గింపు ఉంది. ఇందులో 15 వేల రూపాయల డిస్కౌంట్‌, 15 వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌, రూ. 3 వేల కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి. నెక్సా డీలర్‌ షిప్‌ కింద పరిచయమైన మొదటి మోడల్‌ కార్‌ ఎస్‌-క్రాస్‌పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇందులో 20 వేల రూపాయల డిస్కౌంట్‌, రూ. 25 వేల ఎక్స్చేంజ్‌ ఆఫర్‌, రూ. 10 వేల కార్పొరేట్‌ డిస్కౌంట్స్‌ ఉన్నాయి.

Next Story
Share it