ఆసక్తికరంగా మహేష్ బాబు సినిమా కొత్త టైటిల్!
BY Telugu Gateway27 April 2019 1:15 PM IST
X
Telugu Gateway27 April 2019 1:15 PM IST
మహేష్ బాబు గతంతో పోలిస్తే వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతంలో ఒక సినిమాకు మరో సినిమాకు చాలా గ్యాప్ తీసుకునేవారు. కానీ ఈ మధ్య ఆ ట్రెండ్ ఫాలో అవటం లేదు. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాను పూర్తి చేసి ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన ఈ సూపర్ స్టార్..త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు.
ఆ సినిమాకు ఓ ఆసక్తికరమైన ‘టైటిల్’ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే ‘సరిలేరు నీకెవరు’. అయితే ఇది మహేష్ బాబు ఓకే అంటేనే ముందుకు సాగుతుందని..లేదంటే కొత్త టైటిల్ ను అన్వేషించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Next Story