Telugu Gateway
Cinema

పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘మహర్షి’ టీజర్

పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘మహర్షి’ టీజర్
X

‘నాకో ప్రాబ్లం ఉంది సర్. ఎవరైనా నువ్వు ఓడిపోతావు అంటే గెలిచి చూపించటం నాకు అలవాటు. సక్సెస్ లో పుల్ స్టాప్స్ ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి.’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో మహేష్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘మహర్షి’ టీజర్ ఉగాది రోజున విడుదలైంది. ఈ టీజర్ చూసిన మహేష్ బాబు అభిమానులకు రెండు పండగలు. ఈ సినిమాలో రిషిగా నటిస్తున్న మహేష్ బాబు పారిశ్రామికవేత్తగా నటిస్తున్నట్లు కన్పిస్తోంది టీజర్ చూస్తుంటే.

స్టెయిలిష్‌ లుక్‌లో మహేశ్‌బాబు అదరగొట్టాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=eQraxc7QbU8

Next Story
Share it