టీడీపీకి ఐటి షాక్

ఓ వైపు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి షెల్ కంపెనీల అక్రమాల దందాపై ఈడీ ఆస్తుల జప్తు. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటి దాడులు. ఈ వరస పరిణామాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల ముందు ఇవి ఎందుకు జరుగున్నాయి అని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు బుధవారం దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా పోటీ చేస్తున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అక్కడికి దూసుకొచ్చారు. ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగారు. సీఎం రమేశ్ వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఐటి అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. రాజకీయ దురుద్దేశంతో మోడీ ఈ దాడులకు ఐటి శాఖ అధికారులను పంపుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.