వారణాసిలో రామ్ సందడి
ఓ వైపు వారణాసిలో ఎన్నికల హడావుడి.మరో వైపు హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ సందడి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ప్రస్తుతం వారణాసిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను బుధవారం నుండి వారణాసిలో చిత్రీకరించనున్నారు. సినిమా కీలక ఘట్టంలో ఈ యాక్షన్ పార్ట్ ఉంటుంది. హైదరాబాద్ నుండి సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వారణాసి వెళుతున్నారు. పూరి స్టయిల్లో ఈ యాక్షన్ పార్ట్ ను తెరకెక్కించబోతున్నారు.
రామ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీపక్ శెట్టి, తులసి తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.