Telugu Gateway
Telangana

పరీక్ష రాయకుండానే ‘గ్లోబరీనా’ ను పాస్ చేసిన బోర్డు!

పరీక్ష రాయకుండానే ‘గ్లోబరీనా’ ను పాస్ చేసిన బోర్డు!
X

నిజమేనా?. అసలు ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే గ్లోబరీనా అంత సాహసం చేసిందా?. పరీక్ష రాయకుండానే ఈ సంస్థను పాస్ చేసింది ఎవరు? ఆ సంస్థ కాంట్రాక్ట్ కేటాయించటంలో అంత ఉత్సాహం చూపించిన అధికారులు ఎవరు? మరి అలాంటి అధికారులపై ఇంత వరకూ చర్యలు తీసుకోవటం లేదు?. అధికారులుపై చర్యలు తీసుకుంటే గ్లోబరీనాను ఎవరు తెచ్చిపెట్టారో వెల్లడిస్తారనే భయమే దీనికి కారణమా?. అంటే ఔననే సమాధానం వస్తోంది ఇంటర్ బోర్డు వర్గాల నుంచి. ఏ సంస్థ అయినా ఇంటర్ విద్యార్ధుల ఫలితాలను ప్రాసెస్ చేయాలంటే అంతకు ముందు విద్యా సంవత్సారానికి సంబంధించిన డేటాను తీసుకుని ..ఎలాంటి తప్పలు లేకుండా ప్రాసెస్ చేసి చూపించాల్సి ఉంటుంది. అలా చేసిన సంస్థకే కాంట్రాక్ట్ కట్టబెట్టాలి. కానీ గ్లోబరీనా విషయంలో మాత్రం ఈ నిబంధనను ఇంటర్ బోర్డు అధికారులు తుంగలో తొక్కారు?. సొంతంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారా?. లేక ఎవరి ఒత్తిడితో అయినా తీసుకున్నారు.

ఇంటర్ బోర్డు లో తప్పులు భారీ ఎత్తున జరిగాయని సాక్ష్యాత్తూ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీనే నిర్ణయించింది. కానీ తప్పులకు కారణమైన చిన్న చిన్న వారిపై వేటు వేస్తున్నారు కానీ..అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు...సంస్థలను వదిలేయటం వెనక మతలబు ఏమిటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో అయినా ఉన్నతాధికారులపై చర్యలు ఉంటాయా? లేక గ్లోబరీనా వెనక ఉన్న పెద్దల పేర్లు బయటకు వస్తాయని వారిని వదిలేస్తారా?. ఈ విషయం తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. అయితే ప్రభుత్వ పెద్దల కూడా వ్యవహాత్మకంగా వ్యవహరించారే తప్ప...ఎక్కడా ‘రికార్డెడ్’ గా దొరికే ఛాన్స్ మాత్రం లేదు. అయితే ఈ తప్పులకు కానీ ఖచ్చితంగా ఉన్నతాధికారులు మాత్రం ‘బుక్’ కావాల్సి ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it