Telugu Gateway
Cinema

మహేష్ తో దుమ్మురేపిన పూజా హెగ్డె

మహేష్ తో దుమ్మురేపిన పూజా హెగ్డె
X

టాలీవుడ్ లో టాప్ హీరోలకు ధీటుగా డ్యాన్స్ వేయదగ్గ హీరోయిన్ పూజా హెగ్డె. ఇక ఆమె మహేష్ బాబు పక్కన అయితే అలవోకగా డ్యాన్స్ ఇరగదీయగలదు. ఇప్పుడు అదే పని చేసింది. ‘ఎవరెస్ట్ అంచున’ అంటూ పాటలో పూజా హెగ్డె దుమ్మురేపింది. ‘ఎవరెస్ట్ అంచున పూసిన ఓ రోజా పువ్వే చిరునవ్వే విసిరిందే’ పాటకు సంబంధించిన ప్రివ్యూ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో ఇఫ్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్మయి శ్రీపాద, డీఎస్‌పీ ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. జగపతి బాబు, రావు రమేశ్ ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే.

https://www.youtube.com/watch?v=E_nsZAGJHOM

Next Story
Share it