యోగీ..మాయాలకు ఈసీ షాక్
BY Telugu Gateway15 April 2019 9:38 AM GMT

X
Telugu Gateway15 April 2019 9:38 AM GMT
ఎన్నికల ప్రచారంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న నేతలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. ప్రచారంలో మత విద్వేష వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రచారంపై ఎన్నికల కమిషన్ 72 గంటల పాటు నిషేధం విధించింది. ఇది ఓ రకంగా సీఎంకు షాక్ వంటిదే. మాజీ సీఎం మాయావతిపై కూడా ఈసీ అలాంటి ఆంక్షలే విధించింది.
అయితే ఆమెకు మాత్రం 48 గంటలు ప్రచారం చేయకుండా నిషేధం విధించారు. ఈ నిషేధం మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి రానుంది. అసలు మీకు మీ విధులు..బాధ్యతలు తెలుసా అంటూ సుప్రీంకోర్టు ఈసీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కొరడా ఝుళిపించంట స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో మరెంత మందికి షాక్ తగలనుందో వేచిచూడాల్సిందే. పలువురు నేతల వ్యాఖ్యలపై ఈ మధ్య పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Next Story