Telugu Gateway
Politics

జనసేన దెబ్బకు సీపీఎం విలవిల!

జనసేన దెబ్బకు సీపీఎం విలవిల!
X

ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టకుని సీపీఎం పార్టీ ఘోరంగా నష్టపోయిందా?. అసలు నష్టపోవటానికీ సీపీఎం దగ్గర ఏముంది అన్న ప్రశ్న రావొచ్చు. ఓ ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకుని కనీసం ఒకట్రెండు సీట్లు అయినా గెలుచుకోవాలనేది ఆ పార్టీ ఆలోచన. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ జనసేన పార్టీ అసలు ఉద్దేశాలు..లక్ష్యాలు ఏ మాత్రం గ్రహించకుండా సీపీఎం ఇంత దారుణంగా ఫెయిల్ అవటం ఇదే మొదటిసారి అని ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని పలు జిల్లాలకు చెందిన నేతలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ సొంత పార్టీ, భాగస్వాముల గెలుపు కంటే వేరే లక్ష్యాలు ఉన్నట్లు స్పష్టంగా కనపడుతున్నాయని..వీటిని ఇంత అనుభవం ఉన్న పార్టీ పసిగట్ట లేకపోవటం సరికాదని చెబుతున్నారు. పొత్తులో భాగంగా ఎవరైనా తాము బలం ఉన్న సీట్లు కావాలని కోరకుంటారు. కానీ అందుకు భిన్నంగా సీట్ల కేటాయింపు చేయటంతోనే జనసేన ఉద్దేశాలు స్పష్టం అయిపోయాయని..చివరకు జనసేన చేతిలో కూడా సీపీఎం లాంటి పార్టీ మోసపోవటం దారుణం అని ఓ సీపీఎం నేత వ్యాఖ్యానించారు.

అందుకే పొత్తును పక్కన పెట్టి పలు జిల్లాల్లో ఆ పార్టీ నేతలు తమకు తోచిన పార్టీలకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి జనసేనతో సీపీఎం పొత్తు ఆ పార్టీ నాయకుల్లో ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. పొత్తులో భాగంగా సీపీఎంకు జనసేన ఏడు అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ సీపీఎంను ఈ తరహాలో మోసగించిన రాజకీయ పార్టీ ఇంత వరకూ ఏదీలేదని..పవన్ కళ్యాణ్ తో తమకు ఈ పరిస్థితి ఎదురైందని నేతలు పార్టీ నాయకులు వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వారు పార్టీ నేతలకు పలు ఉదాహరణలను కూడా చూపిస్తున్నారు.

Next Story
Share it