Telugu Gateway
Politics

గంటాను మాజీ మంత్రి చేసిన చంద్రబాబు

గంటాను మాజీ మంత్రి  చేసిన  చంద్రబాబు
X

భవిష్యత్ దర్శనమో. లేక నోరు జారి అన్నారో తెలియదు కానీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సహచరి మంత్రి గంటా శ్రీనివాసరావును ‘మాజీ’ చేసేశారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో గంటాను ప్రజలకు పరిచయం చేస్తూ మాజీ మంత్రి అని సంభోదించటం అక్కడ ఉన్న వారిని షాక్ కు గురి చేసింది. గంటా కూడా ఈ పరిణామంతో ఒకింత ఇబ్బంది పడిన పరిస్థితి. చంద్రబాబు చెప్పినట్లు గంటా మాజీ మంత్రి అయితే...చంద్రబాబు కూడా మాజీ ముఖ్యమంత్రి కావాలి కదా?. ఎన్నికలు జరుగుతున్నా చంద్రబాబు ముఖ్యమంత్రి, మిగిలిన వారంతా మంత్రి పదవుల్లో ఉన్నవారే.

కానీ చంద్రబాబు మరి ఏ ఉద్దేశంతో గంటాను మాజీ మంత్రిని చేశారో తెలియదు. ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారం రోజుల్లో ఏపీలో చంద్రబాబునాయుడి తరపున ప్రచారం చేయటం కోసం రెండుసార్లు రావటం విశేషం. నిజంగా అరవింద్ కేజ్రీవాల్ ఏపీలో ప్రచారం చేయటం వల్ల చంద్రబాబుకు ఓట్లు పడతాయా?. అంటే చంద్రబాబు మాటని నమ్మని ఏపీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ మాటకు విలువ ఇచ్చి ఓట్లు వేస్తారా?. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆదివారం నాటి విశాఖపట్నం సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరైన విషయం తెలిసిందే.

Next Story
Share it