Telugu Gateway
Politics

ఎల్వీకి పదోన్నతి ఇఛ్చింది చంద్రబాబే!

ఎల్వీకి పదోన్నతి ఇఛ్చింది చంద్రబాబే!
X

జగన్ కేసుల్లో సహ నిందితుడు ఎల్వీ సుబ్రమణ్యానికి సీఎస్ పోస్టు ఎలా ఇస్తారు?. ఆయన కోవర్ట్. ఇదీ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే ఎల్వీ సుబ్రమణ్యానికి ఇదే చంద్రబాబు స్వయంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదోన్నతి కల్పించింది. ఎలాంటి కేసులు పెండింగ్ లో ఉన్నా..ఆరోపణలు ఉన్నా అంతటి కీలకమైన పదోన్నతి ఇవ్వరు. కానీ ఏపీ సర్కారే ఎల్వీకి పదోన్నతి ఇచ్చింది. అంటే చంద్రబాబుకు అసలు విషయం తెలియక కాదు. కేవలం అక్కసు. వైజాగ్ కు చెందిన ఓ యూనివర్శిటీకి చెందిన ఓ అడ్డగోలు ఫైలును ఆమోదించటానికి ఎల్వీ సుబ్రమణ్యం నిరాకరాంచారు. అప్పటి నుంచి ఆయనపై చంద్రబాబు ఆగ్రహం అలా కొనసాగుతూనే ఉంది. అందుకే ఎంతో సీనియర్, స్పెషల్ సీఎస్ గా ఉన్న ఆయన్ను ఏ మాత్రం ప్రాధాన్యత లేని క్రీడలు, యువజనాభివృద్ధి శాఖ లో నియమించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించకుండా పక్కన పెట్టారు చంద్రబాబు. తనకు అస్మదీయుడైన అనిల్ చంద్ర పునేఠాను సీఎస్ గా నియమించుకున్నారు. కానీ ఊహించని రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏ బీ వెంకటేశ్వరరావు బదిలీ, సీఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయటం పరిణామాలపై పునేఠాపై వేటు వేసి ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్ గా చేసింది.

ఇది చంద్రబాబుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేసింది. చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు ఈ ఐదేళ్ళలో ఆయన ఏపీని అభివృద్ధిలో దేశంలో అగ్రభాగాన నిలిపి..సుపరిపాలన అందించి ఉంటే ఎల్వీ సుబ్రమణ్యం ప్రజలు టీడీపీకి ఓట్లు వేయకుండా ఆపగలుగుతారా?. అదే నిజం అని చంద్రబాబు చెప్పేట్లు అయితే..ఆయన సీఎస్ గా పునేఠా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏ బీ వెంకటేశ్వర్లును పెట్టుకుని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్లే కదా?. ఉమ్మడి రాష్ట్ర చరిత్రతోపాటు గతంలో ఎప్పుడూ కూడా ఓ ముఖ్యమంత్రి సీఎస్ పై ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయలేదు. అందుకే ఏపీలో ని ఐఏఎస్ లు అందరూ చంద్రబాబు తీరుపై ఇప్పుడు రగిలిపోతున్నారనే చెప్పొచ్చు.

Next Story
Share it