Telugu Gateway
Politics

చంద్రబాబు వీడియో కలకలం..టీడీపీ నేతలు షాక్!

చంద్రబాబు వీడియో కలకలం..టీడీపీ నేతలు షాక్!
X

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన వీడియో ఒకటి తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణల మధ్య ఓ లైవ్ ప్రోగ్రాం ప్రారంభానికి ముందు జరిగిన చర్చ వీడియో చూసిన వారంతా విస్తుపోయే పరిస్థితి. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పై ఓ ప్రాంతం నుంచి లైవ్ తీసుకోవాలని సిబ్బంది చెప్పగానే..రాధాకృష్ణ ఇంకా ఎన్టీఆర్ పేరు కొనసాగుతుందా? అని ప్రశ్నంచటం..దానికి చంద్రబాబు సమాధానం చెప్పిన తీరు టీడీపీ నేతలను కూడా షాక్ కు గురిచేసింది.‘మార్చేస్తున్నాం. పేరు మార్చేస్తున్నాం అంటూ అందులో ఎన్టీఆర్ ను వాడు అని సంభోదించటంతోపాటు..పేరు తీసేస్తాం అని చెప్పి..ఏదో కొన్ని క్యారీ చేయాలి కాబట్టి చేస్తున్నాం.

వాడి పని అయిపోయింది అని వ్యాఖ్యానించటం టీడీపీ లో దుమారం రేపుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా పునర్ వ్యవస్థీకరించాలి...ఎలాంటి మార్పులు చేయాలనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం కదా? అని రాధాకృష్ణ చెప్పగా..దాంతో తాను పూర్తిగా ఏకీభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఐదారు నెలల తర్వాత మీరే చెబుతారు నాకు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీకి అసలైన శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని మీతో చెప్పాల్సిందిగా పదే పదే కోరుతున్నారని రాధాకృష్ణ చంద్రబాబు దృష్టికి తీసుకెళతారు. ప్రైవేట్ నిధులతో పార్టీ తరపున వైద్య సేవలు అందించే విషయంపై కూడా దృష్టి పెట్టాలని రాధాకృష్ణ సూచించారు.

https://www.youtube.com/watch?time_continue=3&v=ABpQsdaCLNw

Next Story
Share it