అమెరికా..నా అమెరికా అంటున్న అల్లు శిరీష్
అల్లు శిరీష్, రుక్సాన్ థిల్లన్ లు జంటగా నటిస్తున్న సినిమానే ‘ఏబీసీడీ’. అదే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ ఉప శీర్షికతో వస్తున్న సినిమా. అమెరికా నుంచి భారత్ కు వచ్చిన తర్వాత హీరో ఎన్ని కష్టాలు పడుతున్నాడో చూపిస్తూ ‘అమెరికా..నా అమెరికా..నిన్ను మిస్సవుతున్నా’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. మళయాళంలో మంచి విజయాన్ని దక్కించుకున్న ఏబీసీడీ సినిమాకు రీమేకే ఈ చిత్రం.
మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మధురా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంజీవి రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. మే 17న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు శిరీష్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమానే ఏబీసీడి.
https://www.youtube.com/watch?time_continue=3&v=JIDNuAS35_U