Telugu Gateway
Cinema

మళ్ళీ అల్లు అర్జున్..పూజా హెగ్డె జోడీ

మళ్ళీ అల్లు అర్జున్..పూజా హెగ్డె జోడీ
X

అల్లు అర్జున్, పూజా హెగ్డె మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరూ గతంలో ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమాలో కలసి నటించిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో అల్లు అర్జున్ జోడీగా పూజానే ఎంపిక చేశారు.

పూజా హెగ్డె ఈ మధ్య టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకెళుతోంది. ఈ కొత్త సినిమా షూటింగ్ బుధవారం నుంచే ప్రారంభం అయింది. ఈ విషయాన్ని సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణ సంస్థలుగా ఉన్నాయి.

Next Story
Share it