డియర్ కామ్రెడ్ లో ‘రష్మిక లుక్’

‘రష్మిక మందన’ను హీరో విజయ్ దేవరకొండ బుజ్జగిస్తున్నాడు. దయచేసి మాపై అలగకు అంటూ కోరుతున్నాడు. గీత గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ జంట..ఇప్పుడు డియర్ కామ్రెడ్ సినిమాలో సందడి చేయనున్నారు. శుక్రవారం రష్మిక పుట్టిన రోజు కావటంతో ఈ సినిమాలోని కొత్త లుక్ ను విడుడల చేశారు విజయ్. కాలేజ్ బ్యాగ్రౌండ్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. క్రికెటర్‌గా రష్మిక నటించనుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్.. మూవీపై హైప్‌ను క్రియేట్చేసింది.
పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో రష్మికకు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. విజయ్ దేవరకొండ తన స్టైల్లో రష్మికకు విషెస్ తెలిపాడు. ఈ నెల 8వ తేదీన ఉదయం 11గంటల 11నిమిషాలకి ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు.. ఈ తొలి పాటను రష్మికకు అంకితం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు.