Telugu Gateway
Politics

బదిలీలపై టీడీపీ గగ్గోలు

బదిలీలపై టీడీపీ గగ్గోలు
X

అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు పోలీసు ఉన్నతాధికారులపై సీఈసీ వేటు వేసిన తీరుపై అధికార తెలుగుదేశం పార్టీ ఆగమాగం అవుతోంది. ఎన్నికలతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావు బదిలీపై టీడీపీ టెన్షన్ కు గురవుతోంది. ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు చేయటం..తర్వాత సీఈసీ చర్యలకు దిగింది. దీంతో దీన్ని కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ అంశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖను సీఈసీకి అందజేసేందుకు టీడీపీ నేతల బృందం ఇప్పటికే ఢిల్లీ వెళ్లింది.

దీంతో పాటు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ లో విచారించాలని టీడీపీ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చటం సరికాదని..దీని వల్ల ముఖ్యమంత్రితోపాటు మంత్రుల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. సహజంగానే ఎన్నికల ప్రక్రియలో కోర్టులో జోక్యం చేసుకోవు. అదే సమయంలో జిల్లాల్లో ఉన్న ప్రతినిధులు కూడా ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.

Next Story
Share it