Telugu Gateway
Politics

రేవంత్ తో చర్చలు..పార్టీ మార్పుపై వెనక్కి తగ్గిన సబిత

రేవంత్ తో చర్చలు..పార్టీ మార్పుపై వెనక్కి తగ్గిన సబిత
X

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరే విషయంపై వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం అయింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వీళ్లతో చర్చలు కూడా జరిపారు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రంగంలో దిగి సబితా ఇంద్రారెడ్డితో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించినట్లే కన్పిస్తున్నాయి ప్రస్తుతానికి. రేవంత్ రెడ్డి, కార్తీక్ లు ఎప్పటి నుంచో సన్నిహితులు. మంగళవారం సాయంత్రం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని తీసుకుని వెళ్ళి రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.

మరి ఈ సమావేశంలో కార్తీక్ రెడ్డి కోరుకుంటున్నట్లు ఎక్కడైనా ఎంపీ సీటు కేటాయిస్తారా?. చేవేళ్ళ సీటు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాదనే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి కార్తీక్ కు సీటు ఎక్కడ సర్దుబాటు చేస్తారు?. సబితాకు ఎలాంటి హామీ ఇస్తారో వేచిచూడాల్సిందే. మొత్తానికి ఈ తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయనే చెప్పొచ్చు.

Next Story
Share it