ఎక్కువ ఎంపీ సీట్లిస్తే ..ఎక్కువ నిధులు
తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదేళ్ళ పాటు కెసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని..కానీ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కూటములు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో 16 సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే కలసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో కలసి కేంద్రంలో ఎవరు ఉండాలో టీఆర్ఎస్ నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. నీతి అయోగ్ సిఫారసు చేసినా కూడా మోడీ సర్కారు తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయలేదని కెటీఆర్ ఆరోపించారు. ఆయన శనివారం నాడే చేవేళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో మాట్లాడారు. వచ్చే రెండు మూడేళ్లలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. చేవెళ్ల సెగ్మెంట్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, రాహుల్ గాంధీ తిరిగారు. వాళ్లిద్దరు తిరిగినా కూటమి అభ్యర్థులు గెలవలేకపోయారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలు.. మోదీకి, రాహుల్‌కు మధ్య ఈ ఎన్నిక జరుగుతుందని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్, బీజేపీని కాదని దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు. మోదీ బోఫోర్స్ అంటే.. రాహుల్ రాఫెల్ అంటున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలు సీఎం కేసీఆర్ చెప్పారు. మోదీ చెప్పిన సబ్ కా సాత్.. సబ్ కా వికాస్‌లో తెలంగాణ లేదు. తెలంగాణకు మోదీ సర్కార్ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. బీజేపీకి 100 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో అధికారం చేపట్టలేరు. ప్రాంతీయ పార్టీలకు ఇదో మంది అవకాశం. అందుకే రాబోయే ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాలు కూడా కీలకం కాబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందించాలనే ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ గులాములు కాదు.. తెలంగాణ గులాబీలు గెలవాలి. ఎవరు పార్టీలో చేరడానికి వచ్చినా దగ్గరకు తీయండి. మనస్పర్థలు పక్కనపెట్టి సమిష్టిగా విజయం కోసం కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.