Telugu Gateway
Politics

రాప్తాడు బరి నుంచి పరిటాల శ్రీరామ్..పోటీకి సునీత దూరం!

రాప్తాడు బరి నుంచి పరిటాల శ్రీరామ్..పోటీకి సునీత దూరం!
X

పరిటాల ఫ్యామిలీలో కీలక పరిణామం. మంత్రిగా ఉన్న పరిటాల సునీత ఈ సారి పోటీకి ధూరంగా ఉండబోతున్నారు. రాప్తాడు సీటును తన కొడుకు పరిటాల శ్రీరామ్ కు కేటాయించాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ బరిలోకి దిగేందుకు రెండు సీట్లు కేటాయించాలని సునీత పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం రాప్తాడుకే ఫ్యామిలీని పరిమితం చేశారు. దీంతో ఉన్న సీటును తన కొడుకు కేటాయించాలని సునీత నిర్ణయం తీసుకున్నారు.

మరి ఈ పరిణామాలపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. రాప్తాడు తోపాటు కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని పరిటాల ఫ్యామిలీ కోరింది. అయితే రాప్తాడు స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ ఆసక్తి కనబరిచారు. దీంతో శ్రీరామ్‌ను అక్కడ నుంచి బరిలో నిలిపేందుకు సునీత సిద్దమయ్యారు. శ్రీరామ్‌ను గెలిపించాల్సిందిగా ఆమె పార్టీ శ్రేణులను కోరారు.

Next Story
Share it