Telugu Gateway
Politics

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్
X

తెలంగాణ కాంగ్రెస్ కు వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి మరో వికెట్ పడేందుకు రెడీ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తో సమావేశం అయ్యారు. ఖమ్మం ఎంపీ లోక్ సభ సీటును ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతోనే ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది.

కెటీఆర్ ను కలసిన తర్వాత కందాల మాట్లాడుతూ...త్వరలో తాను టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ... ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల‍్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌... టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే.

Next Story
Share it