Telugu Gateway
Politics

రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం

రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం
X

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ‘మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ ఈ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు వర్మ. ఇందులో డైరక్ట్ గా చంద్రబాబు గొంతుతోపాటు...తొలిసారి నారా లోకేష్ పేరు కూడా ప్రస్తావించారు. ‘వాడూ నా పిల్లలూ కలిసి, నన్ను చంపేశారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభించిన వర్మ తరువాత ఎన్టీఆర్ వెన్నుపోటు కారణమైన పరిణామాలను చూపించాడు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్‌ నుంచి దూరం చేయడానికి ఎలాంటి కుట్రలు జరిగాయన్న విషయాలను ట్రైలర్‌లో వర్మ చూపించారు. తన సోషల్‌ మీడియా పేజీలో ట్రైలర్‌ రిలీజ్ చేసిన వర్మ ‘ఇది స్వర్గం నుంచి ఎన్టీఆర్ విసిరిన లక్ష్మీ ఆటం బాంబ్’ అంటూ ట్వీట్ చేశారు.

ఎన్నికల సమయంలో విడుదల కానున్న ఈ సినిమా రాజకీయంగా దుమారం రేపే అవకాశం కన్పిస్తోంది. లక్ష్మీపార్వతి పాత్రదారి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన ఉన్నంత వరకూ ఏ హాని తలపెట్టనని హామీ ఇవ్వండి అని కోరగా..చంద్రబాబు పాత్రదారి నా కొడుకు లోకేష్ మీద ఒట్టేసి చెబుతున్నా వంటి డైలాగ్ లు ఈ ట్రైలర్ లో ఉన్నాయి. ఆమెను ఆపాలంటే నాకు మీ నుంచి వంద శాతం సపోర్ట్ కావాలి అంటూ చంద్రబాబు పాత్రదారి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో చేసిన సంభాషణలు కూడా కొత్త ట్రైలర్ లో పొందుపర్చారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి మహామహా అందగత్తెలతో పరిచయం ఉన్న ఆయనకు దాన్లో ఏముందని అంటూ ఓ వివాదస్పద డైలాగ్ కూడా ఇందులో ఉంది.

https://www.youtube.com/watch?v=DUu1gScXol4

Next Story
Share it