వైసీపీలోకి దాడి
BY Telugu Gateway9 March 2019 5:57 AM GMT

X
Telugu Gateway9 March 2019 5:57 AM GMT
విశాఖపట్నం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. తన ఇద్దరు తనయులతో కలసి ఆయన హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. లోటస్‌పాండ్‌లో దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీలో వరస పెట్టి చేరికలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ చేరికలతో పార్టీలో కొత్త జోష్ కూడా వస్తోంది. దాడి, ఆయన తనయులతో పాటు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Next Story