Telugu Gateway
Cinema

అదరగొట్టిన ‘గ్లాస్ మెట్స్ సాంగ్’

అదరగొట్టిన ‘గ్లాస్ మెట్స్ సాంగ్’
X

సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత హిట్ బాట పట్టేలా కన్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘చిత్రలహారి’ టీజర్..పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచగా..తాజాగా విడుదలైన ‘గ్లాస్ మెట్స్’ సాంగ్ కూడా అదరగొట్టింది. దీంతో ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు ఓ రేంజ్ కు వెళ్ళాయనే చెప్పొచ్చు. దీనికి తోడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను తెరకెక్కిస్తోంది.

ఈ పాటలో సాయిధరమ్ తేజ్, సునీల్ చేసిన సందడి ఆకట్టుకునేలా ఉంది. చంద్రబోస్ ఈ పాట అందించగా..దేవీశ్రీ మ్యూజిక్ సమకూర్చారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. స్కూల్ కి వెళ్లే వరకే రా క్లాస్ మెట్స్, రెంట్ కట్టే వరకేరా రూమ్ మేట్స్, కానీ రియల్ రిలేషన్ షిప్ గ్లాస్ మేట్స్’ అంటూ సాగే పాట సరదా సరదాగా సాగిపోయింది.

https://www.youtube.com/watch?v=IE5NAdzL_oE

Next Story
Share it