Telugu Gateway
Politics

టెన్షన్ లో చంద్రబాబు..పెన్షన్ 3వేలకు పెంపు

టెన్షన్ లో చంద్రబాబు..పెన్షన్ 3వేలకు పెంపు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గెలుపు ‘టెన్షన్’ పట్టుకుంది. ఓ వైపు దూసుకెళుతున్నాం..టీడీపీకి తిరుగులేదు అంటూనే ఆయన భయాన్ని బయటపెట్టుకన్నారు. ఎన్నికల ముందు వరకూ వెయ్యి రూపాయల ఉన్న పెన్షన్ ను రెండువేలకు పెంచారు. ఇఫ్పుడు ఏకంగా ఆ పెన్షన్ మొత్తాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ప్రకటించారు. అదే సమయంలో పెన్షన్ అర్హత వయస్సును కూడా అరవై సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు..పట్టణాల్లో ఉచితంగా ఇళ్లు నిర్మించే అంశంతో పాటు ఈ పెన్షన్ల అంశాన్ని కూడా 2019 మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే పెన్షన్ ను దశల వారీగా మూడు వేలకు పెంచుతామని చెప్పిన సమయంలో తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు అదే బాటలో పయనించటానికి రెడీ అయింది అంటే గెలుపుపై ఎంత టెన్షన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ తిట్లను కూడా చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ లో విశ్లేషించారు. టీడీపీ, వైసీపీని పవన్ ఒకే గాటన కట్టేస్తున్నాడు. పవన్ నలుగురిని కలిపి తిడుతుంటే..జగన్ మాత్రం కెసీఆర్, మోడీని ఒక్క మాట అనటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెసీఆర్ ఏపీ ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టేది డమ్మీ అభ్యర్ధి జగన్ కోసమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యేను గెలిపించినా అది కెసీఆర్ కే లాభమన్నారు. హైదరరాబా లో ఉన్న వాళ్ళను వేధిస్తే సహించేదిలేదన్నారు. ఈ గడ్డపై ఉన్న వాళ్లంతా నరేంద్రమోడీ, కెసీఆర్ వ్యతిరేకులే అని చంద్రబాబు ప్రకటించారు. మోడీ, కెసీఆర్ ను విమర్శించని వైసీపీ నేతలు కూడా ఏపీ వ్యతిరేకులే అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపికి పెనువిపత్తుగా మారాడని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూ కబ్జాలు..దోపిడీలే వైసీపీ మేనిఫెస్టో ఏజెండా అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it